ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మునిగిపోయింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియో వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారం అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కంభంపాడు వాగు పొంగి లెవెల్ చప్టా పైనుంచి పారుతున్న నీటి దృశ్యాలను అమరావతిలో అంటూ తప్పు దోవ పట్టిస్తున్నట్టు పేర్కొంది. ఈ కంభంపాడు వాగు అమరావతి రాజధానికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలోని ఉందని, ఆ ప్రాంతం దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అది అమరావతిలోనేనని కొందరు తప్పుడు సమాచారం అందజేస్తున్నట్టు తెలిపింది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
అమరావతి మునిగిపోయిందన్న ప్రచారం అవాస్తవం : తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిక
August 14, 2025
0
Tags