ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భారీగా అల్ఫ్రాజోలం పట్టుబడింది. 8 మందిని అరెస్టు చేసిన డీఆర్‌ఐ అధికారులు.. రూ. 23.88 కోట్ల విలువ చేసే 119.4 కిలోల అల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. ఓ గోదాంలో తయారు చేసి డెలివరీకి సిద్ధంగా ఉన్న అల్ఫ్రాజోలంను నిందితుల నుంచి కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడకు చెందిన డీఆర్‌ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అల్ఫ్రాజోలంతోపాటు 87.8కిలోల ముడి సరకును కూడా డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అచ్యుతాపురంలో 119 కిలోల అల్ఫ్రాజోలం పట్టివేత
August 18, 2025
0
Tags