రూ. 100 కోట్ల వసూలు చేసిన 'మహావతార్‌ నరసింహ' యానిమేటెడ్‌ చిత్రం

Telugu Lo Computer
0


'మహావతార్‌ నరసింహ' సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్‌ దేశాయ్, చైతన్య దేశాయ్‌ సంయుక్తంగా ఈ యానిమేటెడ్‌ చిత్రాన్ని తెరకెక్కించారు . జులై 25 న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మరిన్ని స్క్రీన్స్‌ పెంచుకుంటూ వెళుతున్నారు . బుక్ మైషోలో ఇప్పటికే 25 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి . 'మహావతార్‌ నరసింహ' చిత్రం పది రోజుల్లోనే రూ. 105 కోట్లు సాధించింది. భారత్ లో  విడుదలైన యానిమేషన్ చిత్రాలలో ఇదే అత్యధిక కలెక్షన్స్ కావడం విశేషం. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ గా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. తెలుగులో గీత ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా రిలీజైంది. ఈ సినిమాని విడుదల చేసేలా నరసింహ స్వామి అనుగ్రహించడం తన అదృష్టమని అల్లు అరవింద్‌ తెలిపారు. తెలుగులోనే ఏకంగా రూ. 20 కోట్లకు పైగా నెట్ రాబట్టినట్లు తెలుస్తోంది. హిందీలో రూ. 70 కోట్లకు పైగానే నెట్ కలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)