చిరంజీవి దరఖాస్తును పరిషరించండి : తెలంగాణ హైకోర్టు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌ ఇల్లు పునరుద్ధరణ పనులను క్రమబద్ధీకరించాలని సినీ నటుడు కొణిదెల చిరంజీవి చేసుకున్న దరఖాస్తును పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇల్లు పునరుద్ధరణ చర్యల్లో భాగంగా రిటెయిన్‌ వాల్‌ క్రమబద్ధీకరణకు జూన్‌ 5న జీహెచ్‌ఎంసీకి చేసుకున్న దరఖాస్తుపై స్పందన లేదంటూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవల విచారణ జరిపారు. 2002లో గ్రౌండ్‌, మరో రెండంతస్థుల నిర్మాణానికి అనుమతి తీసుకుని నిర్మించాక పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్టు న్యాయవాది వివరించారు. తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలన్న అభ్యర్థనను జీహెచ్‌ఎంసీ పట్టించుకోలేదని చెప్పారు. దీనిపై జీహెచ్‌ఎంసీ న్యాయవాది స్పందిస్తూ, చట్టప్రకారం దరఖాస్తుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిటిషనర్‌ దరఖాస్తును నాలుగు వారాల్లోగా పరిషరించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించిన హైకోర్టు విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)