ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎర్రగుంట మండలానికి చెందిన బాలిక ప్రొద్దుటూరులో ఇంటర్ చదువుతోంది. సోమవారం కళాళాలకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గండికోటలో విద్యార్థిని మృతదేహం లభించడంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. హత్య చేసి ఉంటారనే కోణంలో విచారిస్తున్నారు. లోకేశ్ అనే యువకుడితో యువతి గండికోట వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
July 15, 2025
0
Tags