ఆంధ్రప్రదేశ్ ఇన్ ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు ఇన్ ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి 30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో ఈ నాలుగు రోజులు ఆయన స్థానంలో పవన్ కళ్యాణ్ కు ఇన్ ఛార్జ్ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సింగపూర్ కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ కూడా సింగపూర్ పర్యటనలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిపాలనా వ్యవహారాలు సజావుగా సాగేందుకు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ను నియమించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)