కొత్త సూపర్‌ ఎర్త్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు !

Telugu Lo Computer
0


మొరాకోలోని ఉకైమీడెన్‌ అబ్జర్వేటరీకి చెందిన అబ్‌డెరహ్మన్‌ సౌబ్‌కియో నేతృత్వంలోని శాస్త్రవేత్తలు టీమ్‌ నాసా ట్రాన్సిటింగ్‌ ఎక్స్‌ప్లానెట్‌ సర్వే శాటిలైట్‌ ద్వారా కొత్త సూపర్‌ ఎర్త్‌ను కనుగొన్నారు. ఇది భూమికి 154 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమితో పోలిస్తే దాదాపు రెట్టింపు పరిమాణంలో, నాలుగు రెట్లు ఎక్కువ బరువుతో ఈ గ్రహం ఉంది. TOI-1846 bగా గుర్తింపు పొందిన ఈ గ్రహాన్ని నీరు అధికంగా ఉన్న సూపర్‌ ఎర్త్‌ అని చెబుతున్నారు. దీని వయస్సు సుమారు 7.2 బిలియన్‌ సంవత్సరాలు. “TOI-1846 bని ట్రాన్సిటింగ్‌ ఎక్స్‌ప్లానెట్‌ సర్వే శాటిలైట్‌ డేటా, భూమిపై నుంచి తీసిన మల్టీకలర్‌ ఫొటోమెట్రిక్‌ డేటా, హై రిజల్యూషన్‌ ఇమేజింగ్‌, స్పెక్ట్రోస్కోపిక్‌ పరిశీలనలతో ధ్రువీకరించాం” అని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ గ్రహం పరిమాణం దాదాపు భూమి పరిమాణం కంటే 1.792 రెట్లు ఎక్కువ. దాని బరువు భూమితో పోలిస్తే 4.4 రెట్లు ఎక్కువ. ఈ గ్రహం ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 568.1 కెల్విన్‌గా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం TOI-1846 b నీరు అధికంగా ఉండే గ్రహం అని భావిస్తున్నారు. దీని అసలైన నిర్మాణం గురించి తెలుసుకోవాలంటే రేడియల్‌ వెలాసిటీ  పరిశీలనలు చేయాలి. “TOI-1846 bపై RV పరిశీలనలకు ఇది అనుకూలంగా ఉంటుంది. MAROON-X అనే ఇన్‌స్ట్రుమెంట్‌ సాయంతో ఇది సాధ్యమవుతుంది. TOI-1846 bకి 47 స్కోరు ఉన్న TSM (ట్రాన్స్‌మిషన్‌ స్పెక్ట్రోస్కోపీ మెట్రిక్‌) ఉంది. చిన్న సబ్‌-నెప్ట్యూన్లకు బెంచ్‌మార్క్‌ 90. దీని కంటే ఇది తక్కువ” అని పరిశోధకులు వెల్లడించారు. ఈ గ్రహానికి మాతృ నక్షత్రం TOI-1846. ఇది సూర్యుడి పరిమాణంతో పోలిస్తే 0.4 రెట్లు చిన్నది. ఆ నక్షత్ర ఉష్ణోగ్రత సుమారు 3,568 కెల్విన్‌. దాని వయస్సు 7.2 బిలియన్‌ సంవత్సరాలు. కాగా, ఇక ఈ ఏడాది ప్రారంభంలో మరో సూపర్‌ ఎర్త్‌ గుర్తించిన విషయం తెలిసిందే. దీనికి HD 20794 d అని పేరు పెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)