సోషల్ మీడియా సంబంధిత కేసుల్లో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లకు మార్గదర్శకాలు జారీ చేసిన హైకోర్టు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా సంబంధిత కేసుల్లో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లకు కీలక మార్గదర్శకాలు హైకోర్టు జారీ చేసింది. రిమాండ్ విధించే విషయం లో అత్యంత జాగ్రత్త గా ఉండాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్నేష్ కుమార్ తీర్పు మరియు ఇమ్రాన్ ప్రతాప్‌గఢి తీర్పు ను తప్పనిసరి గా పాటించాలన్నది ఈ సర్కులర్ సారాంశం. ప్రాథమిక విచారణ తప్పనిసరి. ఇమ్రాన్ ప్రతాప్‌గఢి తీర్పు ను ఉదహరిస్తూ ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణకు సంబంధించిన కేసుల్లో 3 నుంచి 7 సంవత్సరాల శిక్ష ఉండే నేరాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికే ముందుగా ప్రాథమిక విచారణ జరపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే ఈ విచారణను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి అనుమతితో మాత్రమే చేయాలని, 14 రోజుల్లో విచారణ పూర్తిచేయాలి అని నిర్దేశించింది. ఆర్నేష్ కుమార్ తీర్పు లో పేర్కొన్నట్టు 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్న నేరాల్లో ఆటోమెటిక్ గా అరెస్టు చేయకూడదు. పోలీసులు అరెస్టు చేయాలను కుంటే అందుకు గల సరైన కారణాల ను రికార్డ్ చేయాలి. ఈ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలి ఈ మార్గదర్శకాల ను ఉల్లంఘించిన మేజిస్ట్రేట్‌ల పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామ ని హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)