పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ భారత్ - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు పలుసార్లు చెప్పారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం కాల్పుల విరమణ మాత్రమే కాదని, చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అన్నారు."కేంద్రం ఏమని చెబుతుంది? ట్రంప్ కాల్పుల విరమణ చేయించారని చెబుతుందా? కానీ అలా చెప్పలేరు. అయితే అదే నిజం. ఇది కేవలం కాల్పుల విరమణ వరకే కాదు, మనం చర్చించాల్సిన చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. కాల్పుల విరమణ చేయించినట్లు ఇరవై అయిదు సార్లు ట్రంప్ చెప్పారు. అసలు ట్రంప్ ఎవరు? అది ఆయన పని కాదు కదా, ప్రధానమంత్రి సమాధానం ఇవ్వడం లేదు" అని రాహుల్ గాంధీ అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్
July 23, 2025
0
Tags