ఐటీబీపీ సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి సింధూ నదిలో బోల్తా !

Telugu Lo Computer
0


మ్మూ కశ్మీర్‌లో భారత-టిబెటన్ సరిహద్దు పోలీసుల (ఐటీబీపీ) సిబ్బందితో ప్రయాణిస్తున్న ఓ బస్సు అదుపు తప్పి సింధూ నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్నవారంతా గల్లంతైనట్లు తెలుస్తోంది. అయితే భారీ వర్షాల కారణంగా బస్సు అదుపు తప్పినట్లు సమాచారం. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు తడిగా మారాయి. దీంతో ప్రయాణించేటప్పుడు వాహనాలు అదుపు తప్పే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఐటీబీపీ సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి సింధూ నదిలో పడిపోయింది. అయితే ఈ బస్సులో ఇప్పటి వరకు ఎంత మంది ఉన్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బస్సులో ఎందరు ఉన్నవారు వారంతా కూడా గల్లంతయ్యారు. వెంటనే విషయం తెలుసుకుని అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతు అయిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సు అయితే నదిలో కొట్టుకుని పోయింది. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)