హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కి పితృ వియోగం

Telugu Lo Computer
0


హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) సోమవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన సోమవారం చనిపోయినట్లు పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాలో తాజాగా వెల్లడించారు. తన తండ్రి అన్నవాహిక క్యాన్సర్‌ బారిన పడ్డారని ఈ ఏడాదిలోనే పాయల్ చెప్పిన సంగతి తెలిసిందే. తండ్రి మరణంపై ఆమె చాలా ఎమోషనల్ అయింది. "నాన్నా.. క్యాన్సర్ నుంచి మీరు కోలుకునేందుకు నేను చేయగలిగినదంతా చేశాను. కానీ విజయం సాధించలేకపోయా. క్షమించండి" అని పాయల్ రాజ్‌పుత్ భావోద్వేగానికి లోనయ్యారు. గుండె పగిలిన ఎమోజీని ఇన్‌స్టా పోస్టులో షేర్ చేస్తూ తన బాధను పంచుకున్నారు. ఈ క్రమంలో పాయల్ రాజ్‌పుత్ త్వరగా విషాదం నుంచి తేరుకోవాలని అభిమానులు సందేశాలు పెడుతున్నారు. హీరోయిన్ లక్ష్మీరాయ్, నిర్మాత ఎస్కేన్ వంటి వారు ఆమెకు సానుభూతి తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఇలాంటి బాధా సమయాల్లోనే మరింత బలంగా ఉండాలని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)