అమెరికాలో నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ దీపక్ మోడీ అరెస్ట్ అయ్యారు. బ్యాంకుల్లో రూ.13,500 కోట్ల రుణం తీసుకుని మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో నీరవ్ 2018లో యూకే పారిపోయాడు. అయితే 2019లో ఆయన్ని లండన్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉన్నాడు. ఎన్నిసార్లు బెయిల్ కోసం అప్లై చేసుకున్నా ఆయనకు నిరాశే ఎదురైంది. ఎలాగైన అతడిని తీసుకరావాలని భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇదే కేసులో నీరవ్ మోడీ మామ మోహుల్ చోక్సీ కూడా ఇటీవలే బెల్జియంలో అరెస్టయ్యాడు. ఇప్పుడు దీపక్ మోడీ కూడా అరెస్ట్ కావడం గమనార్హం. బ్యాంకులను మోసం చేసిన కేసులో దీపక్ మోడీ పాత్ర ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయి. కీలక ఆధారాలను నాశనం చేయడంలో, సాక్షులను బెదిరించడం, దర్యాప్తును అడ్డుకోవడంలో నేహల్ మోడీ పాత్ర పోషించారని అధికారులు ఆరోపించారు. అంతేకాకుండా బ్యాంకులను మోసం చేసిన డబ్బును మళ్లీ వైట్ మనీగా మార్చడంలో కీలక పాత్ర పోషించారని, ఈ డబ్బును షెల్ కంపెనీల ద్వారా వైట్‌గా మార్చారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అతడిని భారత్‌కు అప్పగించే విషయంపై ఈ నెల 17న కోర్టులో విచారణ జరగనుంది.
నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ దీపక్ మోడీ అరెస్ట్
July 05, 2025
0
Tags