విజయవాడలోని అయోధ్య నగర్‌లో ఉన్న క్షత్రియ భవన్‌లో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య విషయమై పోలీసులుకు సమాచారం అందడంతో పోలీసులు వచ్చి ధర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే నరసింహరాజు బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చారు. స్నేహితుడి హత్య కేసులో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజు జైలు నుంచి ఇటీవలే బెయిల్ పైన బయటకు వచ్చారు. అయితే ఈ లోపే ఈ ఆత్మహత్య సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలేంటో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆత్మహత్య సంఘటన తెలిసివెంటనే నరసింహరాజు భార్య హుటాహుటున హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలు దేరారు.
ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహరాజు ఆత్మహత్య
July 05, 2025
0
Tags