పాకిస్తాన్ లోని పర్యాటక కేంద్రం దగ్గర హఠాత్తుగా వరదలు : నలుగురు మృతి, పలువురు గల్లంతు

Telugu Lo Computer
0


పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్‌లో పర్యాటక కేంద్రం దగ్గర హఠాత్తుగా వరదలు సంభవించాయి. దీంతో ఒక మహిళ సహా నలుగురు పర్యాటకులు మృతి చెందారు. దాదాపు 30 మందికిపైగా వరదల్లో కొట్టుకుపోయారు. రుతుపవనాలు సందర్భంగా కుండపోతగా వర్షం కురవడంతో ఆకస్మికంగా వరదలు సంభవించాయని మంగళవారం అధికారులు తెలిపారు. ఒక్కసారిగా వరదలు సంభవించడంతో పర్యాటక వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయని ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫరాక్ తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని లోధ్రాన్‌కు చెందిన ఒక మహిళ మృతదేహంతో సహా ఇప్పటివరకు నాలుగు మృతదేహాలు బయటకు తీసినట్లు చెప్పారు. డజన్ల కొద్దీ కొట్టుకుపోయారని.. ఇక గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆకస్మిక వరదలు కారణంగా రహదారులు ఘోరంగా దెబ్బతిన్నాయి. అలాగే విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. ఇక తాత్కాలిక ఆశ్రయాల్లో పర్యాటకులకు అధికారులు వసతి కల్పిస్తు్న్నారు. దాదాపు ఏడు కిలోమీటర్ల వరకు ఉన్న వాహనాలు కొట్టుకుపోయినట్లు సమాచారం. దాదాపు 30 మంది వరకు పర్యాటకులు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)