డెలివరీ బాయ్‌ తనపై అత్యాచారం చేశాడంటూ పోలీసులను తప్పుదోవ పట్టించిన యువతిపై కేసు నమోదు

Telugu Lo Computer
0


హారాష్ట్ర లోని పుణెలో ఓ టెకీ (22) ఓ వ్యక్తి డెలివరీ ఏజెంట్‌గా నటిస్తూ తనపై అత్యాచారం చేశాడని ఈనెల 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దొంగతనంగా తన ఫ్లాట్‌లోకి వచ్చి అత్యాచారం చేసి, ఆ తర్వాత స్పృహ కోల్పోయేలా చేశాడని పేర్కొంది. ఆ వ్యక్తి తన ఫొటోలు తీసి విషయం బయటకు చెప్తే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరిస్తూ మెసేజ్‌లు చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించి పలు సాక్ష్యాలను కూడా ఆమె సమర్పించింది. దీనిపై విచారణ జరుపగా అసలు విషయం తెలుసుకొని పోలీసులు అవాక్కయ్యారు. డెలివరీ ఏజెంట్‌గా వచ్చిన ఆ వ్యక్తి టెకీ స్నేహితుడేనని గుర్తించారు. ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, కావాలనే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆ మహిళ తప్పుడు కేసు బనాయించిందని తేల్చారు. దీంతో తిరిగి ఆమె పైనే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుంటామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)