ట్రేడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠా అరెస్టు

Telugu Lo Computer
0


ట్రేడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు రూ.23.25 కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఆ నగదును క్రిప్టోకరెన్సీగా మార్చినట్లు, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. బజాజ్‌ ఫిన్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ పేరుతో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి మోసాలు చేస్తున్నట్లు నిర్ధారించారు. ప్రధాన నిందితుడు కాంబోడియాలో ఉన్నట్లు గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)