రాజమండ్రి సెంట్రల్ జైలుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరలింపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు వచ్చే నెల 1వ తేదీ వరకు రిమాండ్ కు ఆదేశించింది. మిథున్ ను రాజమండ్రి జైలుకు తరలించారు. లిక్కర్ కేసులో ఏ-4 గా ఉన్న మిథున్ ను విచారించిన సెట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసింది. ఈ రోజు వైద్య పరీక్షల తరువాత కోర్టులో ప్రవేశ పెట్టారు. మిథున్ ఆరోగ్య పరిస్థితుల గురించి ఆయన తరపు న్యాయవాదులు వివరించారు. వై కేటగిరీ భద్రత ఉన్న మిథున్ ప్రత్యేక బ్యారెక్ ఇవ్వాలని కోరారు. కాగా, మిథున్ రిమాండ్ రిపోర్టులో సెట్ కీలక అంశాలను ప్రస్తావించింది. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్థారించారు. ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సత్యప్రసాద్‌కు ఐఏఎస్‌గా పదో న్నతి కల్పిస్తామని ఆశ చూపించి స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించారని సిట్ అధికారులు వివరిం చారు. లిక్కర్‌ స్కాంలో లోతైన కుట్ర దాగి ఉందని వివరించారు. ఈ కుట్ర ఛేదించేందుకు భవి ష్యత్‌లోనూ దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. ముడుపుల ద్వారా నిందితులు, ప్రైవేట్‌ వ్యక్తు లు, ఉన్నతాధికారులు రాజకీయ నేతలు, గత ప్రభుత్వంలో ఉన్నవారు లబ్ధి పొందారని చెప్పుకు చ్చారు. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారితో పాటు పరారీలో ఉన్నవారిని కూడా.. అదుపులోకి తీసు కుని విచారించాల్సి ఉందని రిపోర్టులో సిట్ అధికారులు పేర్కొన్నారు. మిథున్ తన ప్రణాళికలను అమలు చేయానికి సత్యప్రసాద్‌ను ఉపయోగించారని తెలిపారు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అధికారులతో సమావేశమై డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారని సిట్‌ అధికారులు వెల్లడించారు. మద్యం ముడుపులను 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని పేర్కొన్నారు. నిందితులకు రాజకీయ పలుకుబడి ఉండటంతో.. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సిట్‌ అధికారులు తెలిపారు. మరింత దర్యాప్తు కోసం మిథున్‌రెడ్డికి రిమాండ్‌ విధించాలని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)