మలేరియాపై పోరుకు కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోన్న ఐసీఎంఆర్‌

Telugu Lo Computer
0


దేశంలో మలేరియాను రూపుమాపడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అడ్‌ఫాల్సీవాక్స్ అనే బహుళ-దశల స్వదేశీ రీకాంబినెంట్ చిమెరిక్ మలేరియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఐసీఎంఆర్‌ దాని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం, భువనేశ్వర్, నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మలేరియా రీసెర్చ్ ద్వారా బయో టెక్నాలజీ విభాగం-నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇమ్యునాలజీ భాగస్వామ్యంతో అడ్‌ఫాల్సీవాక్స్ అనే రీకాంబినెంట్ చిమెరిక్ మలేరియా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అడ్‌ఫాల్సీవాక్స్ అనేది మలేరియాను కలిగించే ప్లాస్మోడియం పరాన్నజీవి రక్తంలో ఉన్న రెండు క్లిష్టమైన దశలను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించిన మొట్టమొదటి చిమెరిక్ మలేరియా వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్‌ మానవులను మలేరియా సంక్రమణ నుంచి రక్షించడమే కాకుండా.. వ్యాధి వ్యాప్తిని తగ్గిస్తున్నట్లు గుర్తించింది. ఐసీఎంఆర్‌ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ ప్రీక్లినికల్ దశలో మంచి ఫలితాన్ని చూపింది. ఇప్పటికే ఉన్న సింగిల్-స్టేజ్ వ్యాక్సిన్‌ల కంటే అడ్‌ఫాల్సీవాక్స్ ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉన్నట్లు ప్రీ-క్లినికల్ డేటా చెబుతోంది. ఇది మానవుల్లో మెరుగైన దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని పెంచి మలేరియా నిర్మూలనకు దోహదపడుతుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ పరిశోధన దశలోనే ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)