ఆంధ్రప్రదేశ్ లో పలు క్రిమినల్ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అన్ని కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు అయ్యింది. ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్ రాగా, ఈరోజు ప్రభుత్వ అసైన్డ్ భూములకు నకిలీ ఇళ్ల పట్టాలు జారీ చేసి ప్రజలను మోసం చేశారన్న కేసులో కూడా బెయిల్ లభించింది. ప్రస్తుతం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో రేపు జైలు నుంచి విడుదల అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో సత్యవర్థన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేశారన్న ఆరోపణలపై వంశీపై బీఎన్‌ఎస్ 140 (1), 308, 351 (3) సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విజయవాడ ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ, రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు రెండు ష్యూరిటీలను సమర్పించాలన్న షరతులు విధించింది. వంశీతో పాటు మరొక నలుగురు నిందితులకు కూడా బెయిల్ లభించింది.
వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
July 01, 2025
0
Tags