ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోమవారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్టు సమాచారం. మానసిక వైద్యుడిగా, ఇంద్రజాలికుడిగా, రచయితగా ఆయన ప్రసిద్ధి చెందారు. తెలుగు. ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లో పట్టాభిరామ్ రాసిన పుస్తకాలు బాగా ఫేమస్ అయ్యాయి. అలాగే విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లో వేలాది పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాసులు నిర్వహించారు.
డాక్టర్ బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
July 01, 2025
0
Tags