ఢిల్లీ నుండి గోవాకు వెళ్తున్న ఇండిగో విమానం బుధవారం దాని రెండు ఇంజిన్లలో ఒకటి విఫలమైనందున పూర్తి అత్యవసర పరిస్థితి మధ్య ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 9.42 గంటలకు విమానం ల్యాండ్ అయిందని సమాచారం. పైలట్ రాత్రి 9.25 గంటలకు అలారం మోగించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ఢిల్లీ నుండి గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా 6E 6271 విమానంలో సాంకేతిక లోపం గుర్తించారు పైలెట్. “విధానాలను అనుసరించి, విమానాన్ని దారి మళ్లించి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు” అని ఇండిగో ప్రతినిధి తెలిపారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశామని, విమానం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించే ముందు అవసరమైన తనిఖీలు నిర్వహిస్తామని కూడా ఇండిగో ప్రతినిధి వెల్లడించారు. “ఈ ఊహించని పరిస్థితి కారణంగా మా కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. ఇండిగోలో కస్టమర్లు, సిబ్బంది, విమానాల భద్రత అత్యంత ముఖ్యమైనది” అని ఇండిగో ప్రతినిధి తెలిపారు.
ఇండిగో విమానం గాల్లో ఉండగానే ఇంజన్ ఫెయిల్ : సురక్షితంగా ముంబై విమానాశ్రయంలో ల్యాండ్
July 17, 2025
0
Tags