తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 పైనుంచి జారిపడ్డ భక్తుడు

Telugu Lo Computer
0


డిశాకు చెందిన ఎల్లయ్యరెడ్డి తన నలుగురు స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం మంగళవారం వచ్చారు. వారు సుదర్శన్ సత్రంలో గది తీసుకున్నారు. అనంతరం అందరూ కలిసి సర్వదర్శనం కోసం వెళ్లారు. అయితే క్యూలైన్‌లో స్నేహితుల నుంచి ఎల్లయ్యరెడ్డి తప్పిపోయారు. ఆ తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్ రెండో అంతస్తుకు చేరుకునే క్రమంలో జారి కిందపడ్డారు. ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో ఎవరూ గమనించలేదు. అతడి చేతులు, కాళ్లు విరిగిపోగా తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం టీటీడీ భద్రతా సిబ్బంది, పోలీసులు ఎల్లయ్యరెడ్డిని గుర్తించారు. వెంటనే తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 దగ్గర ఎల్లయ్య రెడ్డి కింద నుంచి పైఅంతస్తుకు గేట్లు పట్టుకుని ఎక్కే ప్రయత్నంలో జారి 25 అడుగుల కిందకు పడిపోయాడని తెలుస్తోంది. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)