తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే మాజీ కోఆర్డినేటర్ ఓ పన్నీరు సెల్వం ఎన్డీఏ నుంచి వీడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మార్పు చోటుచేసుకోవడానికి పూర్వం ఇవాళ ఉదయం తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పన్నీరుసెల్వం భేటీ అయ్యారు. చెన్నైలోని థియోసోఫికల్ సొసైటీలో స్టాలిన్ మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఆయన్ను పన్నీరుసెల్వం కలిశారు. ఇటీవల ప్రధాని మోడీ తమిళనాడులోని చోళపురం విజిట్ చేశారు. ఆ సమయంలో ఆయనతో భేటీకీ ఓపీఎస్ అపాయింట్‌మెంట్ కోరారు. కానీ మోడీని కలిసేందుకు ఆయనకు అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని పన్నీరు సెల్వం విమర్శించారు. సర్వశిక్షా అభియాన్ నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి ఓపీఎస్ వైదొలిగిన విషయాన్ని మాజీ మంత్రి పన్రుటి రామచంద్రన్ ద్రువీకరించారు.
ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకున్న పన్నీరు సెల్వం
July 31, 2025
0
Tags