ఫిడే మహిళల ప్రపంచకప్‌ విజేతగా దివ్య దేశ్‌ముఖ్

Telugu Lo Computer
0


ఫిడే మహిళల ప్రపంచకప్‌ 2025 విజేతగా దివ్య దేశ్‌ముఖ్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో దివ్య దేశ్‌ముఖ్ భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపిని టై-బ్రేక్‌లలో ఓడించి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్స్‌లో తొలి రెండు గేమ్స్‌ డ్రాగా ముగిశాయి. దీంతో సోమవారం నిర్వహించిన టై బ్రేకర్‌లో దివ్య గెలుపొందింది. ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకున్న నాల్గవ భారతీయ మహిళగా దివ్య దేశ్‌ముఖ్ అవతరించింది. కేవలం 19 ఏళ్ల వయసులో దివ్య ఇప్పుడు భారతదేశంలో 88వ గ్రాండ్‌మాస్టర్ కావడం విశేషం. 

Post a Comment

0Comments

Post a Comment (0)