ఎన్‌కౌంటర్‌లో పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారితో సహా ముగ్గురు హతం

Telugu Lo Computer
0


శ్రీనగర్‌, దచిగామ్ నేషనల్ పార్క్ సమీపంలోని హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ ధృవీకరించింది. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో ఈ ఆపరేషన్ చేపట్టింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని... ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొంది. ఆ ప్రాంతానికి మరిన్ని భద్రతా బలగాలను పంపిస్తున్నారు. ఆపరేషన్ మహాదేవ్‌లో మరణించిన ఉగ్రవాదులలో పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ షా అకా హషీమ్ ముసా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. అయితే ఈ ఆపరేషన్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు కూడా విదేశీయులేనని సంబంధిత వర్గాలు టైమ్స్‌ నౌకు తెలిపాయి. అయితే నిఘా వర్గాల సమాచారం ఆధారంగా హర్వాన్ లోని ముల్నార్ ప్రాంతంలో భద్రతా దళాలు ఈ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది. సెర్చ్ ఆపరేషన్ సమయంలో రెండు రౌండ్ల కాల్పులు వినిపించడంతో... భద్రతా దళాలు కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)