రాజస్థాన్‌లో గత రెండు రోజులుగా కుండపోత వర్షాల వల్ల నాగౌర్ జిల్లాలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. నదులు, డ్రైనేజీలు, చెరువులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు లంపోలై అనే చెరువు నిండిపోవడంతో అందులోని నీరు రోడ్డుపైకి వచ్చి పెద్ద పెద్ద చేపలు కూడా రోడ్లపైకి చేరాయి. కొందరు ఆ చేపల్ని పట్టుకోవడానికి రోడ్లపైకి దిగి వేట ప్రారంభించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో, అజ్మీర్, బుండి, పాలి, పుష్కర్, సవాయి మాధోపూర్ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. నదులు, ఆనకట్టలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాల మధ్య రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. శనివారం కురిసిన భారీ వర్షానికి జోధ్‌పూర్-జైపూర్ హైవేలోని బనాద్ రోడ్డుపై భారీగా నీరు చేరింది. దాంతో వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. జూలై 27-28 తేదీల్లో తూర్పు రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జైపూర్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ రాధే శ్యామ్ శర్మ వెల్లడించారు.
రాజస్థాన్‌లో చెరువు నిండిపోవడంతో రోడ్డుపైకి వచ్చిన చేపలు
July 21, 2025
0
Tags