కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు. అచ్చుతానందన్ గుండె సంబంధిత సమస్యలతో101 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెశారు. జూన్ 23న గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. అచ్యుతానందన్ 1923 అక్టోబర్ 20న కేరళలో జన్మించారు. చిన్నప్పటి నుంచే కమ్యూనిస్ట్ భావాలతో ఉన్న ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. మూడు సార్లు విపక్ష నేతగా ఉన్నారు. 2006 -11 మధ్య ముఖ్యమంత్రిగా సేవలందించారు. సీపీఏం వ్యవస్థాపక సభ్యుల్లో అచ్యుతానందన్ ఒకరు.
కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ కన్నుమూత
July 21, 2025
0
Tags