ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ శాఖలో ఔట్‌సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్లుగా పనిచేస్తున్న వారికి జీతాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేటగిరి-1, కేటగిరీ-2, కేటగిరీ-3 వర్కర్ల వేతనం పెరిగింది. మున్సిపల్ శాఖలో ఔట్‌సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్ల జీతాలను పెంచుతూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. కేటగిరీ-1 వర్కర్ల వేతనం రూ.21,500 నుంచి రూ.24,500కు, కేటగిరీ-2 వర్కర్ల వేతనం రూ.18,500 నుంచి రూ.21,500కు, కేటగిరీ-3 వర్కర్ల వేతనం రూ.15 వేల నుంచి రూ.18,500కు పెంచింది.
మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్లకు జీతాల పెంపు
July 21, 2025
0
Tags