తూర్పు పాకిస్థాన్ శరణార్ధులకు భూ యాజమాన్య హక్కులు కల్పించాలని అధికారులను ఆదేశించిన యోగి ఆదిత్యనాథ్

Telugu Lo Computer
0


తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి దశాబ్దాల కింద శరణార్ధులుగా వచ్చి ఇక్కడే స్ధిరపడిన వారికి భూ యాజమాన్య హక్కులు మంజూరు చేయాలంటూ అధికారులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. సోమవారంనాడు జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం భూ బదలాయింపు కాదని, శరణార్ధి కుటుంబాల దశాబ్దాల పోరాడానికి గుర్తించేందుకు నైతక, జాతీయ భాద్యతతో తీసుకున్న నిర్ణయమని అభివర్ణించారు. రాష్ట్రంలోని పిలిభిత్, లఖింపూర్ ఖేరి, బిజ్నూర్, రాంపూర్ జిల్లాల్లో సుమారు పది వేల మంది బంగ్లా శరణార్ధులు ఉన్నారు. తూర్పు పాకిస్థాన్‌ నుంచి 1960-1975 మధ్య కాలంలో వేలాది మంది శరణార్ధులుగా వచ్చి యూపీలో పునరావాసం పొందుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ట్రాన్సిట్ శిబిరాలకు వారిని తరలించిన తర్వాత చాలామందికి వ్యవసాయ భూములను కేటాయించామని, అయితే చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు కల్పించేందుకు లీగల్ చిక్కులు, అసంపూర్తి పేపర్ వర్క్, నిర్వహణా లోపాలు అడ్డుపడుతున్నాయని వివరించారు. యాజమాన్య హక్కులను రెగ్యులరైజ్ చేసేందుకు అవసరమైన కొత్త లీగల్ మెకానిజం కనుగొనాలని అధికారులను సీఎం ఆదేశించారు. చిరకాలంగా స్థిరపడిన కుటుంబాల పేర్లను నిర్దిష్ట సమయంలోగా రెవెన్యూ రికార్డుల్లో చేర్చాలని జిల్లా మెజిస్ట్రేట్లకు సూచించారు. భూములు అందుబాటులో లేకుంటే ప్రత్యామ్నాయ స్థలాలను చూపించి శరణార్దులు గౌరవప్రదంగా జీవించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణాలు అరచేతులో పెట్టుకుని సొంతగడ్డను వదలిపెట్టి వచ్చిన శరణార్ధుల ఆరు దశాబ్దాల కలను నిజం చేయడం సామాజిక, నైతిక, జాతీయ బాధ్యతని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)