బెట్టింగ్ యాప్ కేసు : రానా, ప్రకాశ్‌ రాజ్‌, విజయ్‌ దేవరకొండకు ఈడీ నోటీసులు

Telugu Lo Computer
0


బెట్టింగ్ యాప్ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే హీరో రానా దగ్గుబాటిని జూలై 23న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రకాశ్‌ రాజ్‌ను జూలై 30న, విజయ్‌ దేవరకొండను ఆగస్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13 విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. కాగా ఈ బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఇప్పటివరకు దాదాపు 25 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది. వీరిలో ప్రకాశ్‌ రాజా, రానా, మంచు లక్ష్మితో పాటు ప్రణీత, నిధి అగర్వాల్‌, విజయ్‌ దేవరకొండ, శ్రీముఖి, అనన్య నాగళ్ల తదితరులు ఉన్నారు. బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్స్‌కు వీరు భారీగా డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. విచారణలో.. ఆ లావాదేవీల గురించి ఈడీ ఆరా తీయనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)