బెంగాలీయులపై చేస్తున్న దాడులకు నిరసనగా జూలై 27 వరకు ర్యాలీలు, కవాతులు నిర్వహిస్తాం !

Telugu Lo Computer
0


కోల్‌కతాలో జరిగిన షాహిద్ దివస్ ర్యాలీలో ;పశ్చిమ మమత ప్రసంగిస్తూ ఈ వ్యా్ఖ్యలు చేశారు. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ బెంగాల్‌లో రాజకీయ మార్పు దేనికి అని ప్రశ్నించారు. 11 ఏళ్ల దేశాన్ని పాలించిన మోడీ ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. మోడీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రిస్తున్నారని, అలాంటి మోడీ తమకు ఉపన్యాసాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ వలసదారులను సంకెళ్లతో బంధించి అమెరికా నుంచి బహిష్కస్తున్నప్పుడు మోడీ, బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. పీవోకేను స్వాధీనం చేసుకోలేకపోయారు. కానీ బెంగాల్ గురించి మాత్రం మాట్లాడుతున్నారని విమర్శించారు. బెంగాలీ భాషపై, బెంగాలీయులపై చేస్తున్న దాడులకు నిరసనగా జూలై 27 వరకు బెంగాల్ అంతటా ర్యాలీలు, కవాతులు నిర్వహిస్తామని మమత చెప్పారు. బెంగాల్‌లో కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలు ఎలాంటి దారుణాలు ఎదుర్కొంటున్నారో దేశానికి తెలుసన్నారు. కాంగ్రెస్‌ది ఎమర్జెన్సీ అయితే.. బీజేపీది సూపర్ ఎమర్జెన్సీ అని వ్యా్ఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీయులను ఇబ్బంది పెడితే.. సంఘీభావంగా నిరసనల్లో పాల్గొనాలని ప్రజలకు మమత పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్‌.. బీజేపీకి అనుకూలంగా పని చేస్తోందని ఆరోపించారు. బీహాల్‌లో చేపట్టినట్లుగానే బెంగాల్‌లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలని కుట్ర చేస్తోందని తెలిపారు. బీహార్‌లో 40 లక్షల ఓట్లు తొలగించారని.. బెంగాల్‌లో కూడా అలానే చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానికి అంగీకరించబోమని మమత తేల్చి చెప్పారు. 2026 ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలిచి.. ఢిల్లీలో బీజేపీని పీఠం దించేందుకు కలిసి రావాలని కోరారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)