పాఠశాలల్లోనే పిల్లల ఆధార్ కార్డుల బయోమెట్రిక్ నవీకరణ ?

Telugu Lo Computer
0


యుఐడిఎఐ త్వరలో పాఠశాలల్లోనే పిల్లల ఆధార్ కార్డుల బయోమెట్రిక్ నవీకరణను ప్రారంభించాలని యోచిస్తోందని పిటిఐ నివేదిక ప్రకారం తెలుస్తోంది. దీని కింద, ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ యంత్రాలను పంపుతారు. ఇక్కడి నుండి వాటిని ఒక పాఠశాల నుంచి మరొక స్థానిక పాఠశాలకు పంపుతారు. ఈ పని దశలవారీగా పూర్తవుతుందని ఉన్నత స్థాయి అధికారి వెల్లడించారు. ఆధార్ అథారిటీ పాఠశాలల ద్వారా ఆధార్ కార్డులను అప్ డేట్ చేసే చర్యలను ప్రారంభించింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భువనేష్ కుమార్ ప్రకారం, పిల్లల బయోమెట్రిక్ నవీకరణలను ప్రారంభించే ప్రాజెక్ట్‌పై పని జరుగుతోంది. సాంకేతికతను పరీక్షిస్తున్నామని.. 45-60 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఆధార్ కార్డులను బయోమెట్రిక్స్‌తో అప్‌డేట్ చేయని పిల్లల సంఖ్య నిరంతరం పెరుగుతోందని, ఇప్పుడు అది 7 కోట్లు దాటిందని భువనేష్ కుమార్ అన్నారు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి అని, ఈ సంఖ్య పెరుగుతున్నందున, పాఠశాలల ద్వారా ఈ పనిని ఆలస్యం చేయకుండా చేయడానికి యుఐడిఎఐ ఒక ప్రణాళికను సిద్ధం చేసిందని వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)