హైదరాబాద్ లోని బిట్స్ పిలానీకి చెందిన ఇద్దరు విద్యార్థులు జయంత్ (మెకానికల్), సౌర్య (ఎలక్ట్రికల్) అద్భుతం చేశారు. ఈ ఇద్దరు విద్యార్థులు తమ హాస్టల్ రూమ్ లోనే అత్యాధునిక డ్రోన్ లను తయారు చేశారు. 300 కి.మీ వేగంతో, రాడార్ కు చిక్కని కమికేజ్ డ్రోన్‌లను తయారు చేశారు. అంతే కాదు భారత సైన్యానికి ఆ డ్రోన్లను విక్రయిస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి ఈ డ్రోన్ లను తయారు చేశారు. రెండు నెలల్లోనే జమ్ము కాశ్మీర్, హర్యానా, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ లోని ఆర్మీ యూనిట్స్ కు ఈ డ్రోన్ లను విక్రయించారు. వీరు చేసిన కేమికేజ్ డ్రోన్ లు 300 కిలీమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. రాడార్ ప్రూఫ్, కచ్చితత్వంతో ఈ డ్రోన్ లు పనిచేస్తాయి.
అత్యాధునిక డ్రోన్లు తయారు చేసిన బిట్స్ పిలానీ విద్యార్థులు
July 22, 2025
0
Tags