విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య రామ మందిరం నమూనా వివాదాస్పదంగా మారింది. 45 రోజులుగా ప్రజల సందర్శనతో కిటకిటలాడిన ఈ నమూనా ఆలయం వద్ద సీతారాముల కళ్యాణం పేరుతో విస్తృత ప్రచారం జరిపారు. 2999 రూపాయలు చెల్లించిన భక్తులకు భద్రాచలం ఆస్థాన వేద పండితుల సమక్షంలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని పోస్టర్లు, బ్రోచర్ల ద్వారా ప్రకటనలు చేశారు. ఈ విషయం భద్రాచలం దేవస్థానం అధికారుల దృష్టికి చేరింది. తమ అనుమతి లేకుండా ఇలా కార్యక్రమం నిర్వహించడం ఎలా సాధ్యమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశాఖ జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా నిర్వాహకులపై 318 (4) బీఎన్సీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. భక్తులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
విశాఖపట్నంలో వివాదాస్పదంగా మారిన గరుడ అయోధ్య రామ మందిరం నమూనా
July 22, 2025
0
Tags