కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ కన్నుమూతపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ఆయన తన జీవితంలో చాలా కాలం ప్రజా సేవకు, కేరళ పురోగతికే అంకితం చేశారన్నారు. తామిద్దరం ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో జరిగిన సంభాషణలు గుర్తుకొచ్చాయని పేర్కొన్న ప్రధాని, వీఎస్‌తో కలిసి మాట్లాడుతున్న ఫొటోను 'ఎక్స్'లో షేర్ చేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రస్థానంలో ప్రముఖ నేత అచ్యుతానందన్ మృతి పట్ల సీపీఎం పొలిట్ బ్యూరో తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. వీఎస్ అని అంతా ప్రేమగా పిలుచుకొనే అచ్యుతానందన్ కేరళలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన సమర్థవంతమైన ప్రజానేత అని కొనియాడింది. 17 ఏళ్ల వయసులోనే కమ్యూనిస్టు పార్టీలో చేరి.. భూస్వాములకు ఎదురొడ్డి పోరాటం చేశారని తెలిపింది. సీఎంగా పనిచేసిన సమయంలో శ్రామిక ప్రజల సంక్షేమం కోనం అనేక పాలనా చర్యలు చేపట్టారని తెలిపింది. కేరళ రాజకీయాలపై వీఎస్ చెరగని ముద్ర వేశారని.. ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని నష్టమని పేర్కొంది. ప్రజానేతకు నివాళులర్పిస్తూ ఎర్ర జెండాను అవనతం చేసినట్లు తెలిపింది. వీఎస్ అచ్యుతానందన్ సతీమణి, కుమారుడు,
జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన వీఎస్ : ప్రధాని నరేంద్ర మోడీ
July 21, 2025
0
Tags