ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 30వ తేదీన విజయవాడలో జరిగిన ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్ నిర్వహించినట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ వర్క్‌షాప్ ద్వారా ప్రభుత్వ, పరిశ్రమ, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు కలిసి కొత్త టెక్నాలజీని సమన్వయంతో పనిచేసే దిశగా చర్చలు తీసుకోవాలని తెలిపింది ప్రభుత్వం. అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో "అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్" ను జూన్ 30 ప్రభుత్వం ప్రకటించింది. ఈ డిక్లరేషన్‌పై ఇవాళ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా క్వాంటం పరిశోధన, ఆవిష్కరణ, ప్రతిభ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనునట్టు ప్రభుత్వం తెలిపింది. దేశంలోనే అతి పెద్ద క్వాంటమ్ వ్యాలీ బెడ్‌గా క్వూ -చిప్- ఇన్ ను వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. 2035 నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధి లక్ష్యంగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. 2026లో ప్రారంభం అయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్ లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ
July 07, 2025
0
Tags