కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైళ్లు ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లతో నడుస్తుండగా బోగీలను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇకపై 14 చైర్‌కార్, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లతో కాచిగూడ-యశ్వంత్‌పుర్-కాచిగూడ మధ్య వందేభారత్ రైళ్లు సర్వీసులందించనున్నాయి. ఈ నిర్ణయం జులై 10వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇప్పటివరకు ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం 530గా ఉండగా తాజాగా 1128కి పెరిగింది.
కాచిగూడ-యశ్వంత్‌పూర్ 'వందే భారత్'లో బోగీలు పెంపు
July 07, 2025
0
Tags