సిరియా రాజధాని డమాస్కస్ పై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడుల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా రాజధానిలోని ప్రభుత్వ టీవీ బిల్డింగ్ కార్యాలయం లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది. ఈ దాడులు లైవ్ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దాడులతో భయపడిన ఓ టీవీ యాంకర్ లైవ్ లో న్యూస్ చదవడం ఆపేసి బయటకు పరుగులు తీసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సిరియాలోని సువీడా ప్రాంతంలో మైనారిటీ వర్గం అయిన డ్రూజ్ తెగ ప్రజలకు, సైన్యానికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో వీరి మధ్యలోకి ఇజ్రాయెల్ ప్రవేశించింది. డ్రూజ్ వర్గం ప్రజలకు మద్దతుగా సిరియా ప్రభుత్వంపై దాడులు చేస్తోంది. ఇదే విషయంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ మంత్రి ఖట్జ్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ సైన్యానికి ఇచ్చిన వార్నింగ్ ముగిసింది.. ఇక దాడులను తట్టుకోండి అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ సైన్యం సిరియాపై దాడులు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ లోని డ్రూజ్ తెగ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సిరియాలోని డ్రూజ్ తెగ ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం రక్షిస్తుందని ఖట్జ్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సిరియాలోని ప్రభుత్వ భవనాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. జులై 15 న బుధవారం రోజు సిరియా రాజధాని డమాస్కస్ లోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసింది. తాజాగా రాజధాని డమాస్కస్ లోని ప్రభుత్వ టీవీ బిల్డింగ్ కార్యాలయం లక్ష్యంగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. ఈ దాడులు లైవ్ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దాడులతో భయపడిన ఓ టీవీ యాంకర్ లైవ్ లో న్యూస్ చదవడం ఆపేసి బయటకు పరుగులు తీసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ప్రభుత్వ టీవీ బిల్డింగ్ పై ఇజ్రాయెల్ దాడులు : భయంతో పరిగెత్తిన న్యూస్ రీడర్
July 16, 2025
0
Tags