తిరుపతి రైల్యే స్టేషన్ లో హిస్సార్ టూ తిరుపతి ట్రైన్‌ లో చెలరేగిన మంటలు : రెండు బోగీలు దగ్ధం

Telugu Lo Computer
0


తిరుపతి రైల్యే స్టేషన్ లో హిస్సార్ టూ తిరుపతి (04717) ట్రైన్‌ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో రెండు బోగీల్లో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హిస్సార్‌ ఎక్స్‌ప్రెస్‌ తిరుపతి రైల్వేస్టేషన్‌ కు వచ్చి ప్రయాణికులను రైల్వే స్టేషన్‌లో దింపేసిన తర్వాత యార్డులోకి వెళ్లే క్రమంలో ఇంజిన్‌ వెనకపైపు ఉన్న బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)