ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ ఆల్-ఇన్ పాడ్‌కాస్ట్ బృందం, హిల్ అండ్ వ్యాలీ ఫోరమ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రపంచంలో మరే ఇతర సీఈవోకు ఇది సాధ్యం కానిది తన మేనేజ్‌మెంట్ బృందంలో పెద్ద ఎత్తున బిలియనీర్లను తయారు చేసినట్లు పేర్కొన్నారు. పరిమిత సంఖ్యలో చిన్న చిన్న కృత్రిమ మేధ పరిశోధక బృందాలతో ఎన్విడియా విజయాలు సాధించి ఆర్థిక ఫలాలను ఎలా అందుకుందో ఆయన వివరించారు. ''నా మేనేజ్‌మెంట్ బృందంలో నేను చాలా మంది బిలియనీర్లను సృష్టించాను. ప్రపంచంలో మరే ఇతర సీఈవోకు ఇది సాధ్యం కాలేదు. వారంతా బాగానే చేస్తున్నారు. ముఖ్యమైన అంశం ఏమిటంటే.. దాదాపు 150 మంది కృత్రిమ మేధ పరిశోధకుల బృందాలు వారికి మెరుగైన ఫండింగ్‌తో అద్భుతాలు సృష్టించవచ్చు. అదే కొంచెం పెద్ద బృందాలకు సరైన వసతులు సమకూర్చగలిగినా మంచి ఫలితాలు పొందొచ్చు. 150 మంది కృత్రిమ మేధ పరిశోధకులున్న కంపెనీకి 20-30 బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నప్పుడు వీటికి ఎందుకు ఇవ్వరు?'' అని వ్యాఖ్యానించారు. చిన్న చిన్న ఏఐ పరిశోధక బృందాల ప్రభావం, వాటి విలువపై అడిగిన ప్రశ్నకు స్పందనగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ ప్రారంభంలో కేవలం 150 మంది ఉండేవారు. ఇక చైనాలోని డీప్‌సీక్‌లో కూడా ఇంతే మంది సిబ్బంది ఉన్నారు. అద్భుత పనితీరు ప్రదర్శించిన ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్, రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ కేటాయింపుపై కూడా ఎన్విడియా సీఈవో సరదాగా స్పందించారు. వాటిని తన జేబులో నుంచే ఇస్తున్నానని చెప్పారు. ఇప్పటికీ ఉద్యోగులకు ఇచ్చే కాంపెన్సేషన్‌ను తాను పరిశీలిస్తానని చెప్పారు. ఇందుకోసం తాను ప్రత్యేక శైలిని అనుసరిస్తానన్నారు. దీంతోపాటు మెషీన్ లెర్నింగ్‌ను వాడతానన్నారు. తాను కంపెనీ నిర్వహణ వ్యయాలను పెంచినట్లు అంగీకరించారు. ఎందుకంటే ఉద్యోగులను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని జెన్సన్ హువాంగ్ పేర్కొన్నారు.
ప్రపంచంలో మరే ఇతర సీఈవోకు ఇది సాధ్యం కానిది నేను చేశాను !
July 27, 2025
0
Tags