ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం మధ్యాహ్నం భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కంటైనర్ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి సుమారు 20 నుంచి 25 వాహనాలపైకి దూసుకుపోయింది. దీంతో బీఎండబ్లూ, మెర్సెడెస్ సహా పలు లగ్జరీ కార్లు సైతం దెబ్బతిన్నాయి. 20 మందికి పైగా ఈ ప్రమాదంలో గాయపడగా, వారిని హుటాహుటిని నవీ ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒక మహిళ మృతి చెందింది. సమాచారం తెలిసిన వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసు బృందాలు హుటాహుటిన సహాయక కార్యకర్తలు చేపట్టాయి. ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అదోషి టన్నెల్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా పలు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రక్కు డ్రైవర్‌ను ఖోపోలి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రమాదం సమయంలో అతను తాగిలేడని వైద్య పరీక్షలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.
ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ రోడ్డు ప్రమాదం : 20 వాహనాలు ధ్వంసం, ఒకరి మృతి
July 26, 2025
0
Tags