ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా నందలూరు వద్ద కన్యాకుమారి- పుణె మధ్య నడిచే జయంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఏసీ బోగీలోని కింది భాగంలో పొగలు రావడం గమనించిన ప్రయాణికులు గార్డుకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది రైలును నందలూరు రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన సిబ్బంది రైలు చక్రాల సమీపంలో బ్రేకుల వద్ద పొగలు వస్తున్నాయని గమనించి మరమ్మతులు చేశారు. అనంతరం రైలు బయలుదేరింది.
కన్యాకుమారి-పుణె జయంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు : అప్రమత్తమైన సిబ్బంది
July 27, 2025
0
Tags