కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం

Telugu Lo Computer
0


కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)ను బ్యాన్‌ చేస్తామని ఆ పార్టీ నేత, కర్ణాటక మంత్రి ప్రియంక్‌ ఖర్గే ప్రకటించారు. ఆ సంస్థ విద్వేషాలను రెచ్చగొట్టడంతోపాటు రాజ్యాంగానికి లోబడి పనిచేయడం లేదని ఆరోపించారు. '' ఒక వేళ మేము మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధిస్తాం. ఇందిరా గాంధీ నిషేధించలేదా? మళ్లీ అదే చేశారు. వారు కేవలం చట్టాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తారు. వారి వద్దకు వచ్చిన రూ. 250 కోట్ల ఫండ్స్‌ ఎక్కడివి. వీటిపై కచ్చితంగా దర్యాప్తు చేయాలి. చట్ట సభ సభ్యుల పని ఏమిటీ శాసనాలు చేయడం. అవసరమైన చట్టాలను మేము తెస్తాం. కానీ, రాజ్యాంగానికి అతీతంగా ప్రవర్తించం'' అని ప్రియాంక్‌ ఖర్గే వ్యాఖ్యానించారు. జూన్‌ 27న కూడా ప్రియాంక్‌ ఆర్‌ఎస్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాడు ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం, క్విట్‌ ఇండియా ఉద్యమం లేదా మరే ఇతర ఆందోళనల్లో వారు పాల్గొనలేదన్నారు. ఆర్‌ఎస్ఎస్‌ రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని వ్యతిరేకిస్తుందని.. భాజపా దాని కీలు బొమ్మలా పనిచేస్తోందని ప్రియాంక్‌ ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)