గ్రీన్ రైల్ ఆవిష్కరణలో భాగంగా భారత్ తన మొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు కోచ్‌ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో విజయవంతంగా పరీక్షించింది. దీనికి సంబంధించిన విషయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ టెస్ట్ రన్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారత్ ప్రస్తుతం 1,200 HP హైడ్రోజన్-శక్తితో నడిచే రైలును అభివృద్ధి చేస్తోందని, ఇది హైడ్రోజన్ రైల్వే సాంకేతికతలో ప్రపంచ అగ్ర దేశాల సరసన మన దేశాన్ని నిలబెట్టే కీలక సంఘటన అని ఆయన పేర్కొన్నారు. 'మొదటి హైడ్రోజన్-పవర్‌తో నడిచే కోచ్ (డ్రైవింగ్ పవర్ కార్) చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో విజయవంతంగా పరీక్షించబడింది. భారతదేశం 1,200 HP హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేస్తోంది. ఇది భారతదేశాన్ని హైడ్రోజన్-శక్తితో నడిచే రైల్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉంచుతుంది' అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ''హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్'' చొరవ కింద 35 హైడ్రోజన్-పవర్డ్ రైళ్లను నడపాలని యోచిస్తున్నట్లు 2023లో అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలియజేశారు. ప్రతీ రైలుకు రూ. 80 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు ట్రయల్ రన్ విజయవంతం !
July 25, 2025
0
Tags