రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆదివారం నిర్వహించిన జర్నలిజం టాక్ షోలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. జర్నలిస్టు మారియాతో సుమారు అర్ధగంటపాటు జరిగిన టాక్ షోలో కేటీఆర్ అనేక అంశాలను ప్రస్తావించారు. వలస కార్మికులను కేసీఆర్ సొంత బిడ్డల్లా చూసుకున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. 2020-21 కొవిడ్ కాలంలో యూపీ, రాజస్థాన్‌తోటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసి స్వస్థలాలకు పంపించారని చెప్పారు. దేశంలో ఇలా పంపించిన తొలి ముఖ్యంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ జనాభా పరంగా కావద్దని కేటీఆర్ అన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు నాడు దక్షిణాది రాష్ర్టాలు జనాభా నియంత్రణ పాటించాయని, జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ర్టాలు ఇప్పుడు జనాభా పరంగా బాగా ఉన్నాయన్నారు. జనాభా పరంగా పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ర్టాల అజమాయిషీ పెరుగుతుందని తెలిపారు. ఇది భారతదేశానికి ఎంతో ప్రమాదకరమని, దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దేశాన్ని మొత్తం హిందీ బెల్డ్ లీడ్ చేసే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి లాభం ఉంటేనే ఏదైనా పనిచేస్తుంది. పార్టీపరంగా తనకు ఏమి లాభం లేదని ఏమీ చేయదు. కశ్మీర్‌ను రెండు రాష్ర్టాలుగా ఎవరైనా మార్చాలని అడిగారా? ఎందుకు మార్చారు. రాజకీయ ప్రయోజనం కోసం కాదా? మోడీ సర్కారు భారత దేశ సమాఖ్య స్ఫూర్తికి గండికొడుతున్నారు. ప్రధాని మోడీ బిగ్ బ్రదర్‌గా ఉండాలి. బిగ్‌బాస్‌లాగా చిన్న రాష్ర్టాలను, దక్షిణాది రాష్ర్టాలపై ఆధిపత్యం చెలాయించకూడదు. 2014-23 వరకు మోడీకి పూర్తిగా ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు. అంశాలవారీగా మద్దతు ఇచ్చాము. సమాఖ్య దేశంలో రాష్ర్టాలు, దేశం కలిసి వెళ్లాలన్నదే తమ అభిమతం. ఎంఎస్‌ఎంఈ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టండి. అక్కడ మంచి వనరులు ఉన్నాయని కేటీఆర్ అన్నారు.
ప్రధాని మోడీ బిగ్ బ్రదర్‌గా ఉండాలి - బిగ్‌బాస్‌లా కాదు : కేటీఆర్
July 20, 2025
0
Tags