ఆగస్టు 1వ తేదీ నాటికి ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టకపోతే లబ్దిదారుల ఇళ్ల మంజూరు రద్దయ్యే అవకాశాలు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని కరీంనగర్ జిల్లా సైదాపూర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఆగస్టు 1వ తేదీ నాటికి ముగ్గు పోసి ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టకపోతే లబ్దిదారుల ఇళ్ల మంజూరు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలని లబ్దిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. భూమి లేని వారికి ఉచితంగా భూమితో పాటు ఆర్థిక సాయం కూడా లభిస్తుంది. ఈ ఆర్థిక సాయం నాలుగు విడతలుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అవుతుంది. నిర్మాణ పురోగతిని బట్టి నిధులు విడుదల చేస్తారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన చాలా మంది లబ్ధిదారులు ఇప్పటికీ ముగ్గు కూడా పోయలేదని, నిర్మాణాలు ప్రారంభించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో వారందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)