ఆర్థిక సంస్కరణలు అంటే గుర్తొచ్చేది పీవీ నరసింహారావు : సీఎం చంద్రబాబు

Telugu Lo Computer
0


ఢిల్లీలో నిర్వహించిన లెక్చర్‌ సిరీస్‌ ఆరో ఎడిషన్‌ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. 'లైఫ్‌ అండ్‌ లెగసీ ఆఫ్‌ పీవీ' అంశంపై ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని, ఉమ్మడి ఏపీ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో ఉందని అన్నారు. 17 భాషలు నేర్చుకున్న పీవీ.. ప్రధాని, కేంద్రమంత్రి, సీఎంగా సేవలందించారని గుర్తుచేశారు. ''దేశానికి అనేక రంగాల్లో పీవీ నరసింహారావు సేవలందించారు. ఆర్థిక సంస్కరణలు అంటే గుర్తొచ్చేది ఆయనే. లైసెన్స్‌రాజ్‌ నిబంధనల నుంచి దేశాన్ని బయటకు తెచ్చారు. 1990ల్లో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సరైన విధానాలు లేక అస్తవ్యస్తంగా ఉండేది. ఆ సమయంలో పీవీ సరైన విధానాలు అమలు చేశారు. ఆయన ప్రధాని అయ్యాక దేశ ఆర్థిక సంస్కరణలు కొత్తరూపు సంతరించుకుని గేమ్‌ ఛేంజర్‌గా మారాయి. పీవీ నరసింహారావు తీసుకున్న చర్యలతోనే ఐటీ విప్లవం వచ్చింది. మైనారిటీ ప్రభుత్వంలోనూ పీవీ చాలా లౌక్యంగా వ్యవహరించారు'' అని చంద్రబాబు కొనియాడారు.

Post a Comment

0Comments

Post a Comment (0)