ప్రియుడి కోసం ఐదేళ్ల కూతురు గొంతు కోసి చంపిన కసాయి తల్లి

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రియుడితో సుఖానికి అడ్డుగా ఉందని ఐదేళ్ల కూతురి గొంతుకోసి చంపేసింది. ఈ విషయం తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. రోషి ఖాన్, షారుఖ్ ఖాన్ భార్యాభర్తలు. రోషి ఖాన్.. ఉదిత్ జైస్వాల్‌తో వివాహేతర సంబంధం నడిపిస్తోంది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె ప్రియుడితో ఉంటోంది. ప్రియుడితో ఉండేందుకు ఐదేళ్ల కుమార్తె అడ్డుగా ఉందని భావించి కుమార్తెను చంపేసి భర్తపై తోసేయాలని ప్రణాళిక రచించింది. అంతే ఐదేళ్ల కూతురి గొంతు కోసేసి చంపి, అనంతరం ఆమె పోలీసులకు ఫోన్ చేసి తన భర్త కుమార్తెను చంపేశాడని ఫిర్యాదు చేసింది. ఎందుకు చంపాడని పోలీసులు అడగగా గొడవ పడుతుండగా భర్త చంపేశాడని వాపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా, రోషి ఖాన్ అబద్ధం చెప్పినట్లుగా గుర్తించారు. ప్రేమికుడితో ఉండేందుకు కుమార్తె అడ్డుగా ఉందని భావించి బాలికను చంపేసి ఆ నేరాన్ని భర్త మీదకు నెట్టేయాలని భావించినట్లుగా పోలీసులు కనుగొన్నారు. సోమవారం రాత్రి భర్త ఇంటికి చేరుకున్నప్పడు ప్రేమికుడు లేడు. కొద్దిసేపటికే గొడవకు దిగారు. ఇదే అనుకూల సమయం అని కుమార్తెను చంపేసి.. ఆ నేరాన్ని భర్త మీదకు తోసేయాలని కుట్ర పన్నింది. మొత్తానికి పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితురాలు నేరాన్ని అంగీకరించింది. ప్రేమ వ్యవహారం కారణంగానే కుమార్తెను సొంత తల్లి చంపేసిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో తామంతా షాక్ అయ్యామని లక్నో వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశ్వజీత్ శ్రీవాస్తవ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)