మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా నిలిచిపోనున్న ఫోన్ పే, గూగుల్ పే, ఏటీఎమ్ సేవలు

Telugu Lo Computer
0


జులై 16న (రేపు) యూపీఐ, ఏటీఎమ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ క్రమంలో నగదు లావాదేవీలకు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వినియోగిస్తున్నారు. సిటీలో ప్రజల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల వరకు అందరూ దీనిని ఉపయోగిస్తున్నారు. ఫిన్ టెక్ సంస్థల కృషితో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా నగదు బదిలీ తేలికగా మారిపోయింది. ఒక్క రూపాయి దగ్గర్నుంచి వేల వరకూ ప్రజలు భౌతిక కరెన్సీ కంటే యూపీఐ చెల్లింపులకే మెుగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో భారత్ లోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. జులై 16న బుధవారం రోజున ఎస్బీఐ కు సంబంధించి ఫోన్ పే, గూగుల్ పే, ఏటీఎమ్ ఖాతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. కస్టమర్లు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా యూపీఐ, ఏటీఎమ్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం కారణంగా.. యూపీఐ, ఐఎమ్పీఎస్, యోనో, ఆర్ఐఎన్ బీ, ఏటీఎమ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలను అర్ధరాత్రి 1:05 ఏమ్ నుంచి 2:10 ఏఎమ్ వరకు దాదాపు 65 నిమిషాల వరకు ఏటీఎమ్, యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. కస్టమర్లు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)