కంబోడియా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన : థాయ్‌లాండ్‌

Telugu Lo Computer
0


థాయ్‌లాండ్‌-కంబోడియాల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగే పరిస్థితి తలెత్తింది. ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగి 24 గంటలైనా పూర్తికాక ముందే కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. కంబోడియా దళాలు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని థాయ్‌లాండ్‌ ఆరోపించింది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఐదు రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణల్లో ఇప్పటివరకు 33 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది నిర్వాసితులయ్యారు. సోమవారం నుంచి కాల్పుల ఒప్పందం అమలు మొదలైనా ఆదిలోనే మళ్లీ సమస్యలు తలెత్తాయి. అర్ధరాత్రి నుంచి తాము కాల్పులు జరపడం ఆపేశామని థాయ్‌ మిలిటరీ చెబుతోంది. కానీ, కంబోడియా పక్షం నుంచి మాత్రం కాల్పులు ఆగలేదని ఆరోపించింది. సరిహద్దు వెంట చాలా ప్రదేశాల్లో రాత్రి మొత్తం కాల్పులు జరిగినట్లు వెల్లడించింది. వీటికి తగిన స్థాయిలో థాయ్‌ నుంచి కూడా ప్రతిస్పందనలు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈవిషయాన్ని థాయ్‌ ప్రతినిధి వింథాయ్‌ సువారే వెల్లడించారు. మరోవైపు కంబోడియా రక్షణ మంత్రి ఓ ఆంగ్ల వార్తాసంస్థతో మాట్లాడుతూ.. కాల్పుల విరమణ మొదలైప్పటినుంచి ఇరుపక్షాల నుంచి ఎక్కడా సాయుధ ఘర్షణలు చోటుచేసుకోలేదని వివరణ ఇచ్చారు. ఇక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జరగాల్సిన స్థానిక కమాండర్ల సమావేశం కూడా రెండుసార్లు వాయిదా పడటం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)